తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారు. త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయిలో పథకాల అమలును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. గజేంద్ర సింగ్ షెకావత్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 'మిషన్ భగీరథ తరహాలో దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ర్టాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేస్తాం. మురుగు నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించే విధానాలు కూడా అవలంభించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలును పరిశీలిస్తాని' షెకావత్ పేర్కొన్నారు. అనంతరం కేంద్రమంత్రికి జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సీఎం కేసీఆర్ సన్మానించారు.
మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి