మేషరాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యం గా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉం టుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయటం మంచిది.
వృషభం : ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమ యం గడుపుతారు. బంధుమిత్రుల కలుసుకోవటం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. మీరు గతంలో పోగొట్టుకున్న వస్తువులు దొరకటం కానీ, రాదనుకున్న డబ్బు తిరిగి రావటం కాని జరుగుతుంది.
మిథునం : ఈ రోజు అనుకున్న పనులు సమయానికి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త విం టారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం కలుగుతుంది ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం. కోర్టు లేదా ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో అనుకూల ఫలితం పొందుతారు.