జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మేయర్, మున్సిపల్ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దే శం చేశారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరిస్తూ ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని ఆదేశించారు. సీఎంతో సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్లు చిట్టిరెడ్డి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునిత, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.
ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఆ మేరకు వివరాలివి..
యూనిట్‌గా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యత కోసం చర్యలు చేపట్టాలి.
ప్రతి మున్సిపాలిటీలో వార్డులు, డివిజన్ల వారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలి.
ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురుగునీటి గుంతలను పూడ్చివేయాలి.
ప్రణాళిక రూపొందించాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.