ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్న విషయం తెలిసిందే. తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి..అధికారులకు వివరాలు తెలియజేయాలని ఉత్తరాఖండ్ శాంతి భద్రతల విభాగం ఉత్తరాఖండ్ డీజీపీ సోమవారం విజ్ఞప్తి చేశారు.
డీజీపీ విజ్ఞప్తి మేరకు తబ్లిఘి జమాత్ కు హాజరైన 180 మంది ముందుకొచ్చారని ఏడీజీ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇద్దరు మాత్రం ఇప్పటివరకు పోలీసుల వద్దకు రాలేదని, వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.